Addam News
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 2:53 am Posted by : Addam News

సగరులు ఐక్యంగా ఉండాలి – సగర క్షత్రియ వెల్ఫేర్‌ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గణపతి ప్రకాష్ రావు

హైద‌రాబాద్‌, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) :   

సగరులంతా ఐక్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా పోరాడాలని సగర క్షత్రియ వెల్ఫేర్‌ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గణపతి ప్రకాష్ రావు సగర పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సగర క్షత్రియ వెల్ఫేర్‌ అండ్ చారిటబుల్, అఖిల భారత సగర మహాసభ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక, దసరా సమ్మేళనం జ‌రిగింది. ఈ సందర్భంగా గణపతి ప్రకాష్ రావు మాట్లాడుతూ… దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, తెలంగాణ ప్రజలంతా ఐక్యంగా జరుపుకునే ఈ పండుగ స్ఫూర్తితో సగరులంతా ఏకమై తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. సగర వధూవరులకు తగిన సంబంధాలు కుదిర్చేందుకు వివాహ పరిచయ వేదికలను నిర్వహిస్తున్నామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో సగర క్షత్రియ వెల్ఫేర్‌ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మ‌న్ మామిడి విద్యాసాగర్, ఉప్పు శేఖర్, అఖిల భార‌త స‌గ‌ర మ‌హాస‌భ అధ్య‌క్షుడు ముత్యాల హ‌రికిష‌న్, గౌర‌వాధ్య‌క్షుడు శ్రీరాల శ్రీరాములు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కొండ‌ల అనిల్ కుమార్‌, కోశాధికారి క‌మ‌టం వేణుగోపాల్‌, కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి కోయేటి రాజ‌శేఖ‌ర రావు, ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రి అంబ‌టి అనిల్, ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియా కో-ఆర్డినేట‌ర్ మ‌ర్క స‌తీష్‌, ప్ర‌చార కార్య‌ద‌ర్శి కొండ‌ల ముఖేష్‌, కార్య‌వ‌ర్గ స‌భ్యులు అవిశెట్టి చంద్ర‌కాంత్, బ‌ల్గూరి ర‌వీంద‌ర్‌, బ‌ర్ల రాజేంద‌ర్‌, దేవేందర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.