Addam News
Newspaper Banner
Date of Publish : 22 December 2025, 10:23 am Posted by : Addam News

అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బంది పడిన నటి

అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బంది పడిన నటి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :   సినీ తారల పట్ల అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు ఒక్కోసారి వారికి ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి. ఇటీవల ‘ది రాజాసాబ్‌’ ఈవెంట్‌లో నటి నిధి అగర్వాల్‌కు ఎదురైన చేదు అనుభవం మరువక ముముందే, తాజాగా స్టార్ హీరోయిన్ సమంతకు (Samantha) కూడా అదే తరహా పరిస్థితి ఎదురైంది.

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఒక షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి సమంత హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని ఆమె తిరిగి తన కారు వద్దకు వెళ్తుండగా, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆమెను చుట్టుముట్టారు. ముఖ్యంగా, సెల్ఫీలు దిగేందుకు చూపిన అత్యుత్సాహం వల్ల అక్కడ ఒక్కసారిగా తోపులాట జరిగింది.

ఉక్కిరిబిక్కిరి అయిన సమంత

అభిమానుల తాకిడి, ఒత్తిడికి సమంత తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆమె చుట్టూ జనం మూగడంతో ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన ఆమె బాడీగార్డ్‌లు అతి కష్టం మీద సమంతకు రక్షణగా నిలబడి, జాగ్రత్తగా ఆమెను కారు ఎక్కించారు. దాంతో సమంత ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలబ్రిటీల వ్యక్తిగత భద్రత పట్ల, వారి సౌకర్యం పట్ల అభిమానులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నెటిజన్లు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సందర్భాలలో నిర్వాహకులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

https://x.com/Cineholic_india/status/2002742467037446483?s=20

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png