Addam News
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 3:14 am Posted by : Addam News

పేద ప్రజలకు వరంగా నిలిచే పథ‌కాలు కొనసాగించాలి – సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల‌ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, అక్టోబర్ 6, ( అద్దం న్యూస్ ) :     గత ప్రభుత్వం నిరుపేదలకు వరంగా నిలిచేలా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథ‌కాలను ప్రవేశపెట్టిందని, ప్రస్తుత ప్రభుత్వం దానిని నీరుగారిస్తే తీవ్రంగా స్పందిస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పద్మారావు గౌడ్ మంగళవారం సీతాఫలమండీలోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… పెళ్ళిళ్ళు చేయడం సామాన్యులకు భారంగా మారిన దశలో కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ పధకాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు ఊరతను కల్పించిందని తెలిపారు. ప్రజలకు ఉపకరించే పథ‌కాలను అమలు చేయాలని, చెక్కుల మంజూరులో జాప్యం తగదని పద్మారావు గౌడ్ సూచించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు తమ అవసరాలకు సీతాఫలమండీలోని తమ కార్యాలయంలో సంప్రదించాల‌ని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సామాల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మీ, రాసురి సునీత, అధికారులు పాల్గొన్నారు.