తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఖాయం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ఇంఛార్జి మారారన్న మహేశ్వర్ రెడ్డి ఇక మారేది ముఖ్యమంత్రేనని వ్యాఖ్య డిసెంబర్‌లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని జోస్యం ముద్ర డెస్క్: తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మారారని, ఇక మారేది ముఖ్యమంత్రేనని వ్యాఖ్యానించారు. పార్టీ ఇంఛార్జిగా రాహుల్ గాంధీ టీమ్ నుండి పెట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి మార్పు మిషన్‌ను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించినట్లు ఆసక్తికర వ్యాఖ్యలు...