Addam News
Newspaper Banner
Date of Publish : 28 May 2025, 3:14 am Posted by : Addam News

నేడు ఎన్‌టి రామారావు జ‌యంతి సంద‌ర్భంగా సేవా కార్య‌క్ర‌మాలు

హైద‌రాబాద్‌, మే 27, అద్దం న్యూస్ :   తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగ‌త ఎన్‌టి.రామారావు జ‌యంతి సందర్బంగా బుధ‌వారం మీ నియోజకవర్గ, డివిజనులలో పార్టీ పతాకావిష్కరణ చేసి ఎన్‌టిఆర్‌కు నివాళులర్పించి, అన్నదానం, పండ్ల పంపిణి, చీరల పంపిణి త‌దిత‌ర సేవా కార్యక్రమాలను నిర్వ‌హించాల‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. మంగ‌ళ‌వారం దోమ‌ల‌గూడ‌లోని న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో జరిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… బుధ‌వారం ఎన్‌టిఆర్ ఘాట్ వ‌ద్ద నివాళులు, పార్టీ ప‌తాకావిష్క‌ర‌ణ‌తో పాటు ఎన్‌టిఆర్ విగ్ర‌హానికి నివాళి, సీతాఫ‌ల్‌మండి వ‌ద్ద సినీ సంగీత విభావ‌రి త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌న్నారు. ఈ కార్య‌క్రమాల‌కు ఎన్‌టిఆర్ త‌న‌యుడు నందమూరి రామకృష్ణ హాజ‌రై కేక్ కటింగు, మహిళలకు వస్త్ర పంపిణి చేస్తార‌న్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల‌ కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, నాయ‌కులు ఎస్.ప్రకాష్, బాను ప్రకాష్ తదితరులు పాల్గోన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png