Addam News
Newspaper Banner
Date of Publish : 22 September 2025, 3:51 am Posted by : Addam News

గాంధీన‌గ‌ర్‌లో సేవా పక్వాడ కార్యక్రమం

గాంధీన‌గ‌ర్‌లో సేవా పక్వాడ కార్యక్రమం

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 21, అద్దం న్యూస్ :            సేవా పక్వాడ లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో ఆదివారం మొక్క‌ల‌ను నాటే కార్య‌క్ర‌మం జ‌రిగింది. డివిజ‌న్‌లోని అశోక్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన మొక్క‌ల‌ను నాటే కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మొక్క‌ల‌ను నాటారు. ఈ సంద‌ర్బంగా ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, దేశ వ్యాప్తంగా చెట్లు నాటడం ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తున్నామన్నారు.  అమ్మ పేరుతో ఒక మొక్క అంటూ మరో సారి దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, మోడీ అభిమానులు మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. దేశాన్ని పచ్చదనంతో తీర్చిదిద్ది మన ప్రధాని మోడీకి పుట్టిన రోజు కానుకగా అందించాలన్నారు.   ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అద్యక్షుడు జి.భరత్ గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ రమేష్ రామ్, డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు దామోదర్, శ్రీకాంత్, సురేష్, రాజు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png