రోషం బాలుకు సేవ పుర‌స్కార్ అవార్డు ప్ర‌దానం

రోషం బాలుకు సేవ పుర‌స్కార్ అవార్డు ప్ర‌దానం హైదరాబాద్, మార్చి 24, అద్దం న్యూస్ :   హైదరాబాద్ జ‌రిగిన 2026 సంవత్సరం ఉగాది పురస్కారాలలో భాగంగా సినీ న‌టుడు రోషం బాలుకు సేవా పురస్కార్ అవార్డు ద‌క్కింది. మాజీ మంత్రి, సినీ న‌టుడు బాబుమోహన్ చేతుల మీదుగా రోషం బాలుకు సేవా పుర‌స్కార్ అవార్డును అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా రోషం బాలు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం న‌టుల‌ను ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. త‌న‌కు సేవా పుర‌స్కార్ అవార్డు ద‌క్క‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.