Addam News
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 12:37 am Posted by : Addam News

జుమ్మ మసీద్ వీధిలో సివ‌రేజి పైప్‌లైన్ ప‌నులు ప్రారంభం

జుమ్మ మసీద్ వీధిలో సివ‌రేజి పైప్‌లైన్ ప‌నులు ప్రారంభం

ముషీరాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 6, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ డివిజ‌న్ జుమ్మ మ‌సీద్ వీధిలో నూత‌న ఏర్పాటు చేయ‌నున్న సివ‌రేజి పైప్‌లైన్ ప‌నులు శుక్ర‌వారం ప్రారంభమ‌య్యాయి. ఈ ప‌నుల‌ను ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు జావీద్ ఖాన్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్ర‌త్యేక చొర‌వ తీసుకొని లెట‌ర్ రాసిన త‌ర్వాత‌ జుమ్మ మ‌సీదు వద్ద సివ‌రేజి పైప్‌లైన్ ప‌నుల కోసం నిధులు మంజూర‌య్యాయ‌ని తెలిపారు. జుమ్మ మ‌సీదు వ‌ద్ద సివ‌రేజి పైప్‌లైన్ ప‌నులను ప్రారంభించేందుకు స‌హ‌క‌రించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు, ప‌నుల‌ను ప్రారంభించిన వాట‌ర్‌వ‌ర్క్స్ డిజిఎం మోహ‌న్ రాజ్‌, మేనేజ‌ర్ సురేష్ ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ఇమ్రాన్ ఖాన్‌, మున్నాఖాన్‌, జాఫ‌ర్ త‌దిత‌రులున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png