Addam News
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 4:17 pm Posted by : Addam News

బీజేపీ రాంనగర్ డివిజన్ అధ్యక్షుడిగా శక్తిసింగ్

బీజేపీ రాంనగర్ డివిజన్ అధ్యక్షుడిగా శక్తిసింగ్

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 20, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా శక్తిసింగ్ నియమితులయ్యారు, ఆయన నియామకాన్ని సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి.భరత్ గౌడ్ గురువారం ప్రకటించారు. శక్తిసింగ్ గతంలో రాంనగర్ డివిజన్ యువ మోర్చా కార్యదర్శిగా, ముషీరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్, నగర కార్యదర్శిగా రెండు పర్యాయాలు పనిచేశారు. ఈ సంద‌ర్భంగా శ‌క్తిసింగ్ మాట్లాడుతూ… త‌న‌ను రాంన‌గ‌ర్ డివిజ‌న్ బిజెపి అధ్య‌క్షుడిగా నియ‌మించినందుకుగాను రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి.భరత్ గౌడ్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌చేశారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో బిజెపి పార్టీ బలోపేతం చేసేందుకు త‌న వంతు కృషి చేస్తాన‌న్నారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో బిజెపి అభ్య‌ర్థుల గెలుపు కోసం ప‌ని చేస్తాన‌ని తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png