Addam News
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 5:01 pm Posted by : Addam News

దానం నాగేందర్‌కు షాక్.. ఎమ్మెల్యేగా అనర్హత వేటు

తెలంగాణ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :  ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడాన్ని స‌వాల్ చేస్తూ బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్లకు హైకోర్టు అనుమతించి, త‌న పరిగణనలోకి తీసుకుంది. దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని కోర్టు ప‌క్క‌న‌పెట్టింది. స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేసిన హైకోర్టు శుక్ర‌వారం ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేసింది. దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా హైకోర్టు ప్రకటించింది. మ‌రో వైపు ఇదే అంశం పై బిఆర్ఎస్ పార్టీ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది. సత్యమేవ జయతే !.. ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌పై అన‌ర్హ‌త వేటు.. ఫలించిన బీఆర్ఎస్ న్యాయపోరాటమ‌ని రేవంత్ ఫిరాయింపు రాజకీయాలకు చెంపపెట్టు అని, న్యాయమే గెలిచింది.. రాజ్యాంగం ముందు రేవంత్ అహంకారం బద్దలైందని బిఆర్ఎస్ పార్టీ పేర్కొంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png