ముషీరాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి షాక్ – బిజెపిలో చేరిన అడిక్‌మెట్ డివిజన్ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కె.సురేందర్
కడప సురేందర్ బిజెపిలో చేరడం పార్టీకి మరింత బలం – డాక్టర్.కె.లక్ష్మణ్ హైదరాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ : బిఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సభ జరుగుతున్న వేళ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. ముషీరాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తుందనే చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలోని డివిజన్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు సఖ్యత కుదరడంలేదు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల మధ్య గ్యాప్ పెరిగింది. కొన్ని డివిజన్లల్లో అధ్యక్షుడి పెత్తనం వల్లనే ఈ గ్యాప్ పెరిగిందని...