USA: బ్రౌన్‌ వర్సిటీలో కాల్పులు.. ఇద్దరి మృతి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికాలో కాల్పుల కలకలం మరోసారి భయాందోళనలు సృష్టించింది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ దారుణ ఘటన యూనివర్సిటీలో పరీక్షలు జరుగుతున్న సమయంలో చోటుచేసుకుంది. ఓ దుండగుడు అకస్మాత్తుగా క్యాంపస్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు క్యాంపస్‌కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి...