రేవంత్ రెడ్డి సభలను అడ్డుకుంటాం – ఇచ్చిన హామీలు అమలు జరిగేంత వరకు నిరసన సెగలు తప్పవు – తెలంగాణ ఉద్యమకారుల జేఏసి చైర్మన్ సుల్తాన్ యాదగిరి
బషీర్‌బాగ్, జూన్ 3, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారులకు తీపి కబురు ప్రకటిస్తారని ఆశిస్తే, అది చేదుగా మారిందని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ( టియుజేఏసి ) చైర్మన్ సుల్తాన్ యాదగిరి ఆవేదన చెందారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం టియుజేఏసి సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల...