శ్రీ గాయత్రీ దేవీ అలంకరణలో శ్రీ కనకాల కట్ట మైసమ్మ అమ్మవారు

క‌వాడిగూడ‌, అక్టోబర్ 14, ( అద్దం న్యూస్ ) :    ద‌స‌రా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ లోయ‌ర్ ట్యాంక్‌బండ్‌లోని శ్రీ క‌న‌కాల క‌ట్ట‌మైస‌మ్మ దేవాల‌యంలో అమ్మ‌వారిని బుధ‌వారం శ్రీ గాయత్రీ దేవీ రూపంలో అలంక‌రించారు. ఈ సంద‌ర్భంగా ప్రత్యేక రుద్ర సహిత చండీ హోమం కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. అలాగే శ్రీ పంచామృతాభిషేకం, ఖ‌డ్గ‌మాలార్చ‌న‌, బాల‌భోగం, క‌ల‌శ‌స్థాప‌న‌, శ్రీ ల‌లితా స‌హ‌స్ర‌నామార్చాన‌, చంఢీ హోమం, మ‌హానివేద‌న మంత్ర‌పుష్ప‌ము, ప్ర‌త్యేక అలంక‌ర‌ణ ఉభ‌య‌దాత‌ల పూజ‌లు, హార‌తి మంత్ర పుష్ప‌ము ద్వార‌బంధ‌న‌ము త‌దిత‌ర పూజా...