భారతీయ విద్యాభవన్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

అలరించిన  ‘ చిన్నికృష్ణులు ’ భారతీయ విద్యాభవన్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కాచిగూడ, సెప్టెంబ‌ర్ 4, ( అద్దం న్యూస్ ) :   భారతీయ సనాతన సంస్కృతీ సంప్రదాయాలకు పండుగలు నిలువుటద్దాలుగా నిలుస్తాయని గోల్నాకలోని భారతీయ విద్యాభవన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో శుక్రవారం పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం బృందావనాన్ని తలపించింది. విద్యార్థులు చిన్ని కృష్ణుడు, అల్లరి కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో సందడి...