బ్లాక్‌మెయిల్ చేస్తున్న యువకుడిని హత్య చేసిన అక్కాచెల్లెళ్లు
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: పెళ్లి సంబంధం చెడగొట్టడంతో పాటు ఫోన్‌లోని వీడియోలు చూపుతూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని అక్కాచెల్లెళ్లు ఓ యువకుడిని హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్(32) హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతితో అతడికి పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆమె అక్కతోనూ పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల...