Addam News
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 2:46 am Posted by : Addam News

వివేక్‌న‌గ‌ర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

వివేక్‌న‌గ‌ర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో
వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

ముషీరాబాద్‌, మార్చి 27, అద్దం న్యూస్ :      హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌న‌గ‌ర్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో మంగళ వాయిద్యాల మధ్య.. వేద మంత్రోచ్ఛరణలతో సాంప్రదాయనుసారంగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ హాజరై ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ జానకి సుధాకర్, ఆలయ ఈవో మాచర్ల దేవనాథం తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మజీ కార్పొరేటర్ అరుణ జయేందర్ బాబు, ఆలయ ముఖ్య అర్చకులు బుగ్గ లక్ష్మీపతి శర్మ, అర్చకులు కందాక వేంకటాద్రి, ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు శ్యామ్ ముదిరాజ్, పద్మావతి, నిర్మల, రామకృష్ణ, హరీష్, నీతారాణి, లక్ష్మీనారాయణ రావు, సుబ్బారావు, బాల కుమార్, నవీన్ ప్రసాద్, వెన్న‌ల‌కంటి వెంకట శిశు కుమార్, వెంకట ప్రతాప్ కుమార్, లోకనాథ్, వెంకట్రావు, గణేష్, రామకోటేశ్వరరావు, మోహన్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటారం యాదగిరి గౌడ్, గుండు జగదీష్ బాబు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png