WPL 2026: ‘ఆమె వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం’

WPL 2026: 'ఆమె వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం' అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నదినే డిక్లెర్క్‌ అసాధారణ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోనే ఓడిపోయే మ్యాచ్‌లో విజయం సాధించామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. ఆర్‌సీబీ అంటేనే థ్రిల్లర్ మ్యాచ్‌లకు పెట్టింది పేరు అని చెప్పుకొచ్చింది. డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 3 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఓటమి తప్పదనుకున్న ఈ మ్యాచ్‌లో నదినే డీక్లెర్క్(44 బంతుల్లో 7 ఫోర్లు,...