Addam News
Newspaper Banner
Date of Publish : 07 August 2025, 3:41 am Posted by : Addam News

విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి

విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి


హైదరాబాద్, ఆగ‌స్టు 06, అద్దం న్యూస్ :    ఎస్ఎఫ్ఐ ఖైరతాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో బుధ‌వారం గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఎస్ఎఫ్ఐ విద్యార్థులతో అన్ని క్లాస్ రూమ్‌లు తిరిగి వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరము సమస్యలపై ప్రిన్సిపాల్‌కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కళాశాలలో పొద్దున మధ్యాహ్నం ( షిఫ్ట్ వైస్ ) కాలేజీ నడవడం వల్ల ఇబ్బంది అవుతుందని విద్యార్థులు చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఈ రెండు నెలలు అవుతున్న ఇప్పటి వరకు టైమ్‌ టేబుల్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీమాన్ నాయక్ లు తెలిపారు. కళాశాలలో మూత్రశాలలు సరిగ్గా లేవని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కళాశాలలో గ్రౌండ్ ఉన్న విద్యార్థులను ఆడుకోవడానికి అనుమతించకపోవడం విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. కళాశాల చుట్టుప్రక్కల చెత్త చెదారంతో ఉండడంతో వాటిని క్లీన్ చేయించాలని కోరామ‌న్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తానని విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యక్ష, కార్యదర్శులు ప్రవీణ్, ఆంజనేయులు, మనోజ్, భారత్, మదన్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png