Addam News
Newspaper Banner
Date of Publish : 04 April 2025, 9:00 am Posted by : Addam News

మంచినీటి సమస్యను పరిష్కరించండి – బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జై సింహ

 

హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్ అజార్ గల్లీ, సెయింట్ పాయిస్ స్కూల్ వీధుల్లో ఉన్న మంచినీటి సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జై సింహ కోరారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఆయా బస్తివాసులు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల మేరకు ఆయా బస్తీల్లో ముఠా జై సింహ పర్యటించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల మేరకు అజార్ గల్లీలో మంచినీటి పైప్ లైన్లకు మరమ్మతులు పనులు ప్రారంభించారు, ఈ పనులను జయసింహ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ముఠా జై సింహ మాట్లాడుతూ… ప్రజలకు మంచినీటి సమస్య రాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యనారాయణ బాబు, దీన్ దయాల్, నిఖిల్, స్థానికులు పాల్గొన్నారు. BRS party youth wing leader Muta Jai ​​Simha

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png