ఈ నెల 26, 27 తేదీల్లో సివిల్ ఇంజినీరింగ్ పరిష్కారాలపై ప్రత్యేక సదస్సు
హైదరాబాద్, నవంబర్ 3, ( అద్దం న్యూస్ ) : సుస్థిరమైన, వినూత్నమైన సివిల్ ఇంజినీరింగ్ పరిష్కారాలపై ఈ నెల 26, 27 తేదీల్లో ప్రత్యేక సదస్సు జరుగనుంది. సివిల్ ఇంజినీరింగ్ రంగంలో స్థిరమైన అభివృద్ధి, వినూత్న ఆవిష్కరణలు, విపత్తులను తట్టుకునే నిర్మాణాల రూపకల్పన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించేందుకు అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్ ( ఇండియా ) హైదరాబాద్ సెంటర్ ఆధ్వర్యంలో RIDES–2026 సదస్సును నిర్వహించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ( ESCI...