Addam News
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 1:00 pm Posted by : Addam News

ఆస‌రా పెన్ష‌న్ కెవైసి అప్‌డేట్ కోసం ప్ర‌త్యేక కౌంట‌ర్ ఏర్పాటు

ఆస‌రా పెన్ష‌న్ కెవైసి అప్‌డేట్ కోసం ప్ర‌త్యేక కౌంట‌ర్ ఏర్పాటు

హైద‌రాబాద్‌, మే 26, ( అద్దం న్యూస్ ) :   ఆస‌రా పెన్ష‌న్ కెవైసి అప్‌డేట్ ప్ర‌క్రియ‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసే చ‌ర్య‌ల్లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని చొర‌వ‌తో మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక కౌంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌లో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కౌంట‌ర్‌ను మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… ముషీరాబాద్ మండల రెవెన్యూ కార్యాలయంలో కిక్కిరిసిన జనాలతో మహిళలు, వృద్ధులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. గాంధీనగర్ డివిజన్‌లోని జవహర్‌న‌గ‌ర్ కమ్యూనిటీహాల్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయించడం వల్ల పెన్షన్ లబ్ధిదారులకు కెవైసి అప్‌డేట్ సులభతరం అయిందన్నారు. తొలి రోజు సుమారు 70 మంది లబ్ధిదారుల కెవైసి అప్‌డేట్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారని, డివిజన్ లోని మహిళలు, పెన్షనర్లు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని మాజీ కార్పొరేటర్ పావ‌ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్లు శివ సత్య ప్రసాద్, రాము, భార్గవి, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నవీన్, ఆనంద్‌రావు, బిజేపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, రాజు, ఎం.ఉమేష్, జ్ఞానేశ్వర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png