రోడ్ల పై వర్షపు నీరు నిలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి – జిహెచ్ఎంసి అధికారులకు సూచించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

  హైదరాబాద్, ఏప్రిల్ 4 అద్దం న్యూస్ :     రోడ్ల పై వర్షపు నీరు నిలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. హైద‌రాబాద్‌లో గురువారం సాయంత్రం కురిసిన భారీ వ‌ర్షానికి ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని లోత‌ట్టు ప్రాంతాల్లో వ‌ర‌ద నీరు నిలిచిపోయాయి. స్థానికుల ఫిర్యాదు మేర‌కు గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ జిహెచ్ఎంసి అధికారుల‌తో క‌లిసి ఆర్టీసి క్రాస్ రోడ్ శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం, జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ స్కూల్ మెయిన్...