Addam News
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 10:43 pm Posted by : Addam News

న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యంలో బాల‌ల చ‌దువు కోసం ప్ర‌త్యేక విభాగం – బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్ సీతా ద‌యాక‌ర్‌రెడ్డి

న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యంలో బాల‌ల చ‌దువు కోసం ప్ర‌త్యేక విభాగం
– బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్ సీతా ద‌యాక‌ర్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 02, అద్దం న్యూస్ :     న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యంలో బాల‌ల చ‌దువు కోసం ప్ర‌త్యేక విభాగం ఉంద‌ని తెలంగాణ రాష్ట్ర‌ బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్ సీతా ద‌యాక‌ర్‌రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం ఆమె హైదరాబాద్ చిక్క‌డ‌ప‌ల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంథాలయంలో బాలలకు అందుబాటులో ఉన్న పుస్తకాలు, సౌకర్యాలు, వసతులు గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. బాలల చదువుకు ఉపయోగపడే పుస్తకాల లభ్యత, పిల్లల కోసం ప్రత్యేక విభాగం, పఠన వాతావరణంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రెయిలీ సెక్షన్ పరిశీలించారు. లైబ్రరీలో విద్యార్థులు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు కల్పించడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సందర్బంగా బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్ సీతా ద‌యాక‌ర్‌రెడ్డికి శాలువా క‌ప్పి హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరి పద్మజ సన్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గోగుల సరిత, ప్రేమలత, అగర్వాల్ బి.వచన్ కుమార్, షబానా, ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు చంద్రకళ, సీతామహాలక్ష్మి. అవినాష్, వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, బొల్లం మహేందర్, కృష్ణారెడ్డి, పిడి.మహేష్, అనిల్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png