Addam News
Newspaper Banner
Date of Publish : 16 October 2025, 2:06 am Posted by : Addam News

డివిజన్‌లోని పార్కుల అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

డివిజన్‌లోని పార్కుల అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం

– గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్



హైదరాబాద్, అక్టోబ‌ర్ 15, అద్దం న్యూస్ : 

డివిజన్‌లోని పార్కుల అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామ‌ని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. గాంధీనగర్ డివిజన్‌లోని పార్కుల అభివృద్ధి చర్యల్లో భాగంగా బుధవారం చిక్కడపల్లిలోని వివేక్‌న‌గ‌ర్ ర్ పీపుల్స్ పార్క్‌లో చేపట్టిన పనులను స్థానిక‌ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సంద‌ర్బంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… పార్క్ చుట్టూ కాంపౌండ్ వాల్ పెయింటింగ్, లైట్ల ఏర్పాట్లు తదితర పనులను త్వరలో పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. డివిజన్‌లోని అన్ని పార్కులను సుందరికరించేందుకు కావలిసిన ఏర్పాట్లు పూర్తి చేశామని, సీనియర్ సిటిజన్లకు, పిల్లలకు మరియు స్థానికులకు పార్కుల ద్వారా స్వచ్ఛ‌మైన‌, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి నేతలు పి.నర్సింగ్ రావు, ప్రశాంత్, పీపుల్స్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రేమ్ కుమార్, గణేష్, ఆంజనేయులు, సుబ్బారావు, జితేందర్, లింగరాజ్, రామచెందర్, రజినీకాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png