Addam News
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 1:47 pm Posted by : Addam News

వైభ‌వంగా శ్రీవారి గ‌జ‌వాహ‌న సేవ‌

 

వైభ‌వంగా శ్రీవారి గ‌జ‌వాహ‌న సేవ‌
 వైభ‌వంగా శ్రీవారి గ‌జ‌వాహ‌న సేవ‌

హైదరాబాద్, మే 15, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో కొన‌సాగుతున్న స్వామి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా గురువారం ఆల‌యంలో విశేష పూజ‌లు జ‌రిగాయి. ఇందులో భాగంగా శ్రీ స్వామి వారి గ‌జ‌వాహ‌న సేవ చిక్క‌డ‌ప‌ల్లి పుర‌వీధుల్లో వేద‌మంత్రాల‌తో, మంగ‌ళ‌వాయిద్యాల‌తో వైభ‌వంగా జ‌రిగింది. అలాగే బాల‌బోగ‌ము, బిందేతీర్థం, బ‌లిహార‌ణ‌ము, మంత్ర‌పుష్పం, డ్రావిడ ప్ర‌భంధ పారాయ‌ణాలు, ప‌ల్ల‌కి సేవ, మ‌హానివేద‌న త‌దిత‌ర పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య వంవ‌పారంప‌ర్య ధ‌ర్మ‌క‌ర్త జి.శ్రీనాథ్‌గౌడ్‌, కీర్తి, సువ‌ర్ణ‌ల‌త‌, ఆల‌య కార్య‌నిర్వాహ‌ణాధికారిణి అన్న‌పూర్ణ‌, భ‌క్తులు పాల్గొన్నారు.

వైభ‌వంగా శ్రీవారి గ‌జ‌వాహ‌న సేవ‌
వైభ‌వంగా శ్రీవారి గ‌జ‌వాహ‌న సేవ‌

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png