Addam News
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 3:00 am Posted by : Addam News

శ్రీ క‌న‌కాల క‌ట్ట‌మైస‌మ్మ బోనాల ఉత్స‌వాల‌కు రావాల‌ని మంత్రుల‌కు ఆహ్వానం

లోయ‌ర్ ట్యాంక్‌బండ్
శ్రీ క‌న‌కాల క‌ట్ట‌మైస‌మ్మ
బోనాల ఉత్స‌వాల‌కు రావాల‌ని మంత్రుల‌కు ఆహ్వానం

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 4, ( అద్దం న్యూస్ ) :  ఆషాఢ జాతర ( బోనాలు ) ఉత్స‌వాలు హైద‌రాబాద్ లోయ‌ర్ ట్యాంక్ బండ్‌లోని శ్రీ క‌న‌కాల క‌ట్ట‌మైస‌మ్మ దేవాల‌యంలో ఈ నెల 9, 10 తేదీల్లో జ‌రుగ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌య వ్య‌వ‌స్థాప‌క‌ చైర్మన్ గోల్కొండ గౌతమ్ కుమార్, ఆలయ కార్యనిర్వాహనాధికారి పి.మహేందర్ గౌడ్, ఆల‌య అర్చ‌కుడు సాత్విక్ శ‌ర్మ‌ లు మంగ‌ళ‌వారం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ను, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాకర్ ను, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బోనాల‌ మహోత్సవానికి హాజ‌రుకావాల‌ని ఆహ్వాన ప‌త్రాల‌ను అంద‌చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png