భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు
హైదరాబాద్, అద్దం న్యూస్ : శ్రీ అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్‌లో భక్తి శ్రద్ధలతో జరిగాయి. శ్రీ అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకల సందర్భంగా బిజెపి సీనియర్ నాయకుడు కె.జగదీష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ హాజరై భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్‌గౌడ్, బిజెపి అడిక్‌మెట్ డివిజన్ పాశం సాయికృష్ణ యాదవ్,...