Addam News
Newspaper Banner
Date of Publish : 07 April 2025, 4:18 am Posted by : Addam News

సికింద్రాబాద్‌లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

 

సికింద్రాబాద్‌లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

సికింద్రాబాద్, అద్దం న్యూస్ :    సికింద్రాబాద్‌లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ఘనంగా జరిగాయి. ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాములవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. చిలకలగూడ శ్రీ సాయిబాబా సమేత బాలాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ సందీప్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ నాగులూరి సాయిబాబా వారి కుటుంబ సభ్యులు సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా ఈ ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నగరం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహిస్తుంటారు. ఆలయ చైర్మన్ నాగులూరి సాయి బాబా సమక్షంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కళ్యాణం అనంతరం అన్న ప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ బిల్డర్ కుంచాల ఏడుకొండలు, బీఆర్ఎస్ నాయకుడు కరాటే రాజు, ఆలయ ధర్మకర్తల మండలి ప్రతినిధులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png