శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి శ్రీ రుద్ర సహిత చండి హోమం
కవాడిగూడ, అక్టోబర్ 11, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధి చెందిన లోయర్ ట్యాంక్బండ్ శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఆదివారం దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని శ్రీ బాలా త్రిపురసుందరి దేవీ అలంకరణలో అలంకరించారు. ఈ సందర్భంగా శ్రీ కనకాల కట్టమైసమ్మ అమ్మవారికి శ్రీ రుద్ర సహిత చండిహోమాన్ని నిర్వహించారు. ఈ హోమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ జి.గోల్కొండ గౌతమ్ కుమార్ పటేల్, ఆలయ...