6న తుల్జాభవన్‌లో శ్రీ సీతారాముల కళ్యాణం

  కాచిగూడ‌, ఏప్రిల్ 4, అద్దం న్యూస్ : దేవాదాయ, ధర్మాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన ఆదివారం కాచిగూడలోని తుల్జాభవన్ ధర్మశాల శ్రీరామ మందిరం ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహించ‌నున్న‌ట్లు తుల్జాభవన్ ధర్మశాల కార్యనిర్వహణాధికారి ఎస్.అంజనారెడ్డి తెలిపారు. శుక్రవారం తుల్జాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉదయం 10 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం ప్రారంభమవుతుందని, మ‌ధ్యాహ్నం ఒంటి గంటకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. రాత్రి 7 గంటలకు ఉత్సవమూర్తుల పల్లకి...