టిపిఎస్‌కెలో శ్రీ శ్రీ 115వ జయంతి సభ
హైదరాబాద్, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : అక్షరాలతో అగ్గి రవ్వలు పుట్టించి, చందస్సు సంకెళ్లను తెంచేసి, ఆధునిక కవిత్వానికి అంటుగట్టిన ప్రజాకవి శ్రీ శ్రీ అని పలువురు వక్తలు అన్నారు. బుధవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రం టిపిఎస్‌కె హాల్‌లో శ్రీ శ్రీ 115వ జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా శ్రీ శ్రీ చిత్రపటాలను పట్టుకుని శ్రీ శ్రీ కవిత్వం వర్థిల్లాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు, మత్స్య కార్మిక...