Addam News
Newspaper Banner
Date of Publish : 19 May 2025, 12:37 pm Posted by : Addam News

ఘ‌నంగా శ్రీ స్వామి వారి శృంగార ర‌థోత్స‌వం

ఘ‌నంగా శ్రీ స్వామి వారి శృంగార ర‌థోత్స‌వం
ఘ‌నంగా శ్రీ స్వామి వారి శృంగార ర‌థోత్స‌వం

హైద‌రాబాద్‌, మే 18, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆదివారం చిక్క‌డ‌ప‌ల్లి పుర‌వీధుల్లో వేద‌మంత్రాల‌తో, మంగ‌ళ వాయిద్యాల‌తో స్వామివారి శృంగార ర‌థోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. అంత‌కుముందు స్వామివారికి క‌ల‌శాల‌తో ఘ‌టాభిషేకం చేశారు. బిందేతీర్థం, బాలభోగం, హ‌వ‌నం, బ‌లిహార‌ణం, ర‌థప్ర‌తిష్ట హార‌తి, మంత్ర‌పుష్పం త‌దిత‌ర పూజ‌లు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య వంవ‌పారంప‌ర్య ధ‌ర్మ‌క‌ర్త జి.శ్రీనాథ్‌గౌడ్‌, కీర్తి, సువ‌ర్ణ‌ల‌త‌, దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఆల‌య కార్య‌నిర్వాహ‌ణాధికారిణి అన్న‌పూర్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png