
హైదరాబాద్, మే 20, అద్దం న్యూస్ : ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం భక్తి శ్రద్ధలతో ముగిశాయి. చివరి రోజు కావడంతో ఆలయంలో మంగళవారం రాత్రి శ్రీ స్వామి వారి శృంగార డోలోత్సవం వైభవంగా జరిగింది. అంతకుముందు ఉదయం నుంచి బిందె తీర్థం, బాలభోగం, మంత్రపుష్పంతో పాటు81 కలశాలతో ఘటాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అభిషేకం చేయించిన భక్తులకు శ్రీ స్వామి వారి వెండిపూత ఘటాభిషేక అష్టలక్ష్మీ కలశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త జి.శ్రీనాథ్‌గౌడ్, శిల్ప, సువర్ణలత, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ కార్యనిర్వాహణాధికారిణి అన్నపూర్ణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png