Addam News
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 5:24 am Posted by : Addam News

నేడు శ్రీ హ‌నుమాన్ ఉత్స‌వ స‌మితి ఆధ్వ‌ర్యంలో శ్రీ వీర హ‌నుమాన్ విజ‌య యాత్ర‌

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :   శ్రీ హ‌నుమాన్ ఉత్స‌వ స‌మితి ఆధ్వ‌ర్యంలో హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా నేడు ( శ‌నివారం ) శ్రీ వీర హ‌నుమాన్ విజ‌య యాత్ర‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఉత్స‌వ స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డ్డం న‌వీన్ పేర్కొన్నారు. శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ వీర హ‌నుమాన్ విజ‌య యాత్రను అడిక్‌మెట్ అభయాంజ‌నేయ‌స్వామి దేవాల‌యం నుంచి ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు. అక్క‌డి నుంచి రాంన‌గ‌ర్ చౌర‌స్తా, చేప‌ల మార్కెట్‌, ద‌యారా మార్కెట్‌, బాకారం, హ‌రిన‌గ‌ర్ వ‌ర‌కు శోభాయాత్ర కొన‌సాగుతుంద‌ని తెలిపారు. హిందువులంద‌రూ పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి ఈ వీర హ‌నుమాన్ విజ‌య యాత్ర‌లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png