నేడు శ్రీ హ‌నుమాన్ ఉత్స‌వ స‌మితి ఆధ్వ‌ర్యంలో శ్రీ వీర హ‌నుమాన్ విజ‌య యాత్ర‌

  హైదరాబాద్, అద్దం న్యూస్ :   శ్రీ హ‌నుమాన్ ఉత్స‌వ స‌మితి ఆధ్వ‌ర్యంలో హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా నేడు ( శ‌నివారం ) శ్రీ వీర హ‌నుమాన్ విజ‌య యాత్ర‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఉత్స‌వ స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డ్డం న‌వీన్ పేర్కొన్నారు. శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ వీర హ‌నుమాన్ విజ‌య యాత్రను అడిక్‌మెట్ అభయాంజ‌నేయ‌స్వామి దేవాల‌యం నుంచి ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు. అక్క‌డి నుంచి రాంన‌గ‌ర్ చౌర‌స్తా, చేప‌ల మార్కెట్‌, ద‌యారా మార్కెట్‌, బాకారం, హ‌రిన‌గ‌ర్ వ‌ర‌కు శోభాయాత్ర కొన‌సాగుతుంద‌ని తెలిపారు....