Addam News
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 9:16 am Posted by : Addam News

Philsalt: ఒక్కోసారి మేం అస్సలు మాట్లాడుకోం..!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bengaluru) స్టార్‌ బ్యాటర్‌ ఫిల్‌సాల్ట్‌ (Phil Salt) మైదానంలో.. ముఖ్యంగా బ్యాటింగ్‌ సమయంలో విరాట్‌కోహ్లీతో (Virat Kohli) తనకున్న అనుబంధాన్ని గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఓపెనింగ్‌ భాగస్వామితో మంచి అనుబంధం, సమన్వయం ఉండాలన్నాడు. అది ఐపీఎల్‌లో (IPL) తనకు, విరాట్‌ కోహ్లీ మధ్య ఉందన్నాడు. ‘మీరు ఎవరితో ఇన్నింగ్స్ ఓపెనింగ్‌ చేస్తున్నారో.. వారితో మంచి అనుబంధాన్ని కలిగిఉండాలి. వారు ఎలా ఆడతారో మీరు అర్థం చేసుకోవాలి. అలాగే వారికి కూడా మీ ఆటపై అవగాహన ఉండాలి. మేమిద్దరం ఇక్కడికి వచ్చిన క్షణం నుంచే మా మధ్య అనుబంధం ఏర్పడింది’ అని ఫిల్‌సాల్ట్‌ అన్నాడు.

‘మేం ఎలా ఆడతామనే విషయంలో మా ఇద్దరికీ పరస్పర అవగాహన ఉంది. ఉదాహరణకు జైపుర్‌లో మేం పెద్దగా మాట్లాడుకోలేదు. అయినా చక్కటి సమన్వయంతో ఆడాం. దిల్లీలోనూ అంతే. కొన్నిసార్లు మేమిద్దరం షాట్ల గురించి మాట్లాడుకుంటాం. మరి కొన్నిసార్లు ఆ అవసరం రాదు. సహజంగా జరిగిపోతుంది’ అని ఫిల్‌సాల్ట్‌.. తనకు, విరాట్‌కు మధ్య ఉన్న సమన్వయం గురించి వివరించాడు.

2025 సీజన్‌కు ముందు ఆర్సీబీ 11.50 కోట్లకు ఫిల్‌సాల్ట్‌ను సొంతం చేసుకుంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న వేలానికి ముందు జట్టు రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లలో సాల్ట్‌ ఒకరు. ఆర్సీబీ దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్‌ 2025 సీజన్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. విరాట్‌కోహ్లీ తన నిలకడైన ప్రదర్శనతో వరుసగా మూడో సీజన్‌లో 600లకు పైగా పరుగులు సాధించి, ఆర్సీబీని విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png