బీసీలంద‌రూ ఐక్యంగా ఉద్య‌మాలు చేస్తేనే రాజ్యాధికారం సాధన – బీసీల మహాధర్నాలో పలువురు వక్తలు

  హైదరాబాద్, అద్దం న్యూస్ :    బీసీలు ఉవ్వెత్తున ఉద్యమాలు చేసినప్పుడే రాజ్యాధికారం సాధించుకుంటాం అని పలువురు వక్తలు తెలిపారు. శుక్రవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్ర‌వారం హైద‌రాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీసీల మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య,...