హెచ్‌సియులో చెట్లు నరకడం ఆపండి – హైకోర్టు ఆదేశం

తెలంగాణ బ్యూరో, ఏప్రిల్ 2, అద్దం న్యూస్ : హెచ్‌సియులో చెట్లు నరకడం ఆపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హెచ్‌సియులోని 400 ఎకరాల భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వట ఫౌండేషన్ అనే స్వచ్చంధ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ మేరకు బుధవారం మధ్యాహ్నం తర్వాత హైకోర్టులో హెచ్‌సియు 400 ఎకరాల భూమి పై వాదోపవాదనులు జరిగాయి. హైకోర్టులో హెచ్‌సియు భూములపై ప్రభుత్వ తరపు లాయర్ వింతవాదనలు వినిపించారు. గూగుల్ ఫోటోలు చూపించి అక్కడ ఫారెస్ట్ ఉంది అంటున్నారు, అక్కడ...