చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయ వీధిలో కలుషిత నీటి సరఫరా అవుతుంటే ప‌ట్టించుకోరా ! – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 24, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ వీధిలో కలుషిత నీటి సరఫరా అవుతుంటే ప‌ట్టించుకోరా అని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పిన్న‌మ‌నేని సాయిబాబా అన్నారు. “నానాటికి తీసికట్టు నానం బొట్టు” అన్న చందంగా హైదరాబాదు నగర పరిస్థితి ఘోరంగా తయారైందని.. నగరంలో ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగిపొర్లుతున్న పట్టించుకునే నాధుడే లేడని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న...