తాగునీటి దుర్వినియోగంపై కఠిన చర్యలు –ప్రజల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్‌లో రూ.5 వేల జరిమానా
వాట్సాప్ ఫిర్యాదు అందిన వెంటనే క్షేత్రస్థాయి తనిఖీ – ఉల్లంఘన నిర్ధారణతో జరిమానా విధించిన అధికారులు – నీటి వృథాపై ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి హైదరాబాద్, అక్టోబర్ 28, ( అద్దం న్యూస్ ) : తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉల్లంఘనలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ పరిధిలో తాగునీటిని వృథా చేసిన ఓ నివాసానికి రూ.5 వేల జరిమానా విధించింది....