బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలి – సీపీఎం గ్రేటర్ కన్వీనర్ మహేందర్
హైదరాబాద్, జూన్ 24, అద్దం న్యూస్ : అభివృద్ధి పనులపై ఆటంకం కలిగిస్తున్న బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం గ్రేటర్ కన్వీనర్ మహేందర్ కోరారు. మంగళవారం బతుకమ్మకుంట వద్ద ఆయన మాట్లాడుతూ... బతుకమ్మ కుంటని అభివృద్ధి చేస్తుంటే బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి పదే పదే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖ నుండి హైడ్రా కమిషనర్ రంగనాథ్ విచ్చేసి బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్...