విద్యార్ధుల స్కాలర్‌షిప్‌లు, ఫీజుల బ‌కాయిలు చెల్లించాలి – విద్యార్ధులతో క‌లిసి రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.కృష్ణ‌య్య భారీ ప్రదర్శన

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 23, ( అద్దం న్యూస్ ) :    రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజుల బ‌కాయిలు 8500 కోట్ల రూపాయ‌ల‌ను వెంటనే విడుదల చేయాలని, ఈ స్కీము ఎత్తివేయాలనే కుట్రలు మానుకోవాలని, ఈ స్కీమును యధాతధంగా పాత పద్ధతిలోనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వంద‌లాది మంది విద్యార్థులు బుధ‌వారం హైద‌రాబాద్ విద్యానగర్ వివేకానంద ప్ర‌భుత్వ కాలేజీ నుంచి భారీ ప్రదర్శన జరిపారు. ఈ ప్రదర్శనకు రాష్ట్ర విద్యార్ధి సంఘం అధ్యక్షుడు పగిళ్ళ సతీష్ నాయకత్వం...