Addam News
Newspaper Banner
Date of Publish : 28 September 2025, 2:08 pm Posted by : Addam News

భ‌గ‌త్‌సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలి – డ్రగ్స్ గంజాయి వ్యతిరేక సమాజాన్ని నిర్మిద్దాం – ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు అశోక్‌రెడ్డి, జావీద్

భ‌గ‌త్‌సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలి

– డ్రగ్స్ గంజాయి వ్యతిరేక సమాజాన్ని నిర్మిద్దాం

– ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు అశోక్‌రెడ్డి, జావీద్

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 27, అద్దం న్యూస్ :   భ‌గ‌త్‌సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలని, – డ్రగ్స్ గంజాయి వ్యతిరేక సమాజాన్ని నిర్మిద్దామ‌ని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు అశోక్‌రెడ్డి, జావీద్ లు అన్నారు. శ‌నివారం హైదరాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కమిటీల ఆధ్వర్యంలో షహీద్ భ‌గ‌త్‌సింగ్ 118 వ జయంతి సందర్భంగా నారాయణగూడ నుండి దోమ‌ల‌గూడ ఏవి కాలేజ్ వరకు బైక్ ర్యాలీ జరిగింది. అనంతరం భ‌గ‌త్‌సింగ్ విగ్రహానికి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు అశోక్‌రెడ్డి, జావీద్ లు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి, జావీద్ లు మాట్లాడుతూ… భ‌గ‌త్‌సింగ్ స్వాతంత్య్ర‌ సమరయోధుడు, సోషలిస్ట్ విప్లవకారుడన్నారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడారన్నారు.                       లాహోర్ కుట్ర కేసులో భాగంగా అసెంబ్లీలో బాంబు విసిరి, బ్రిటిష్ పాలకులచే 23 మార్చి 1931న ఉరి తీయబడ్డారని తెలిపారు. “ఇన్‌క్విలాబ్ జిందాబాద్” నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారుని, ఆయన ధైర్యం, దేశభక్తి ఇప్పటికీ ప్రేరణగా నిలుస్తాయన్నారు. విద్యార్థులు చదువుకునే దశలో సంకల్పంతో విద్యారంగంలో ముందుకు వెళ్లాలని అన్నారు.

అదే విధంగా యువత భ‌గ‌త్‌సింగ్ ఆశయాలతో ముందుకు సాగాలని, మాదకద్రవ్యాల పై వ్యతిరేకంగా పోరాడాలి అని అన్నారు. ఈ సమాజాన్ని డ్రగ్స్ వ్యతిరేక సమాజంగా తీర్చిదిద్దే బాధ్యత ఈ యువత పైన ఉందన్నారు. కాబట్టి డ్రగ్స్ నిర్మూలన చేసే కర్తవ్యాన్ని భ‌గ‌త్‌సింగ్ తెగువతో యువత తీసుకొని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లెనిన్, శ్రీమాన్, రాజన్న, నాగేందర్, ప్రవీణ్, అర్జున్, కార్తీక్, గోపి తదితరులు పాల్గొన్నారు. 


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png