జూన్ 15 నాటికి విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అందాలి – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

జూన్ 15 నాటికి విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అందాలి – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :  జూన్ 15 నాటికి విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అంతా అందాల‌ని, అలా అంద‌గానే స‌ర‌ఫ‌రాదారుల‌కు చెల్లింపులు పూర్తి చేయాలని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్త‌కాలు, ఇత‌ర సామ‌గ్రి స‌కాలంలో అందించగలిగితే విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో శ్ర‌ద్ధ చూపుతార‌ని అన్నారు. విద్యా శాఖ‌తో పాటు బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ‌ల ప‌రిధిలోని విద్యా సంస్థ‌ల్లో రానున్న విద్యా...