మాద‌క ద్ర‌వ్యాల‌కు విద్యార్థులు దూరంగా ఉండాలి – చిక్క‌డ‌ప‌ల్లి డివిజ‌న్ ఏసిపి ర‌మేష్ కుమార్‌

హైదరాబాద్, జూన్ 26, అద్దం న్యూస్ :    మాద‌క ద్ర‌వ్యాల‌కు విద్యార్థులు దూరంగా ఉండాలని చిక్క‌డ‌ప‌ల్లి డివిజ‌న్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ( ఏసిపి ) ర‌మేష్ కుమార్ అన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సంద‌ర్భంగా ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం జరిగింది. గురువారం రాంన‌గ‌ర్ ఓ ప్రైవేట్ స్కూల్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఏసిపి ర‌మేష్‌కుమార్‌, ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాంబాబు లు హాజ‌రై పాఠ‌శాల ప్రిన్సిపాల్‌, విద్యార్థులు, పోలీస్...