హైదరాబాద్, సెప్టెంబర్ 20, ( అద్దం న్యూస్ ) : వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదిక సదస్సు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. పాలకవర్గాలపై ప్రజలు అన్ని విధాల విసిగిపోయారన్నారు. చంద్రకుమార్ మాట్లాడుతూ… వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు ఐక్యవేదిక పైకి రావాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన బాధలతో ఉన్నారన్నారు. డాక్టర్.ఎస్.నాగేశ్వరరావు వామపక్ష ప్రజాతంత్ర వేదిక నాయకులు సభ ఉద్దేశాన్ని వివరిస్తూ అందరి నాయకులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సభలో ప్రొఫెసర్ హర గోపాల్ మాట్లాడుతూ… ఆకలి దారిద్రం అసమానతలు పెరుగుతుంటే ఫాసిజం అంతే ప్రమాదకరస్థాయిలో పెరుగుతుందన్నారు. ఫాసిజానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తక్షణం ఐక్యంగా పోరాడాలి అన్నారు. ఒకరిని పులి తింటుంది.. మోడీ అనే పులి నన్ను తినడం లేదు కదా అంటే నీ వంతు కూడా వస్తుందన్నారు. కమ్యూనిస్టులు ఐక్యం కావాలన్నారు.
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై బలమైన ప్రజాతంత్ర లౌకిక శక్తుల ఐక్య కార్యచరణ జరగాలన్నారు. గతాన్ని సమీక్షించుకొని, ప్రజా ఉద్యమాలు బలంగా చేస్తూ, ఎన్నికల్లో బడా పెట్టుబడిదారీ పాలకవర్గ పార్టీలకు దూరంగా బలమైన ప్రజా ప్రత్యామ్ న్యాయాన్ని నిర్మించాలన్నారు. ఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గాదిగోని రవి మాట్లాడుతూ… వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత కృషి కొనసాగలన్నారు. గతంలోవలె వైఫల్యం కానటువంటి కమ్యూనిస్టు ప్రజాతంత్ర ఐక్య ఉద్యమాల ప్రత్యామ్నాయ కార్యచరణ సాగాలన్నారు. కీలకమైన ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు ప్రజాతంత్ర శక్తులు అంగీకారానికి వచ్చి, బడా సంపన్న పాలక వర్గాలకు వ్యతిరేకమైన బలమైన ఎన్నికల ఫ్రంట్ నిర్మాణానికి పూనుకోవాలన్నారు.
పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ: మోడీ ఫ్యాసానికి వ్యతిరేకంగా చర్చలు విశ్లేషణలు ఆపి కార్యచరణ మాత్రమే చేపట్టాలి అన్నారు. ఇలాంటి సభలు నిర్వహించడం చాలా కష్టమైపోయిందన్నారు. నరేంద్ర మోడీ పాలకులు ప్రజల మధ్య సంఘర్షణను సృష్టిస్తున్నాడని విమర్శించారు. సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ… ఒక బలమైన వామపక్ష ప్రజాతంత్ర కార్యచరణకై కృషి చేస్తాం అన్నారు. ఆ ప్రయత్నం ఇంకా విస్తృతంగా జరగాలని.. కలిసి పని చేద్దాం కలిసి కృషి చేద్దామన్నారు. సిపిఐ ( ఎంఎల్ ) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జీవి చలపతిరావు మాట్లాడుతూ… కమ్యూనిస్టుల ఐక్యత తక్షణమే అవసరమన్నారు. 80 ఏళ్ల తర్వాత 80 కోట్ల మంది రేషన్ బియ్యంతో బతుకుతున్నారన్నారు. సిపిఐఎంఎల్ నాయకులు మోడం మల్లేశం మాట్లాడుతూ… కమ్యూనిస్టులు ప్రజాతంత్ర శక్తులు ప్రజా సమస్యలపై తక్షణం ఐక్యంగా పోరాడాలి అన్నారు.
సిపిఐ రాష్ట్ర నాయకులు పశ్య పద్మ మాట్లాడుతూ… కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై తక్షణం విస్తృతస్థాయి ఐక్య కార్యచరణ కొరకు కృషి చేయాలన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఫ్రంట్ నాయకురారాలు విమలక్క మాట్లాడుతూ… కమ్యూనిస్టులు తక్షణం ఐక్యం కావాలన్నారు. ఫాసిజం ప్రమాదం దేశంలో పెరిగిపోతుందన్నారు. వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదిక నాయకుడు బొజ్జ బిక్షమయ్య మాట్లాడుతూ… కళాకారులతో మంచి ఉత్సాహాన్ని ఇచ్చే పాటలు పాడించారన్నారు. వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదిక నాయకుడు నైనాల గోవర్ధన్ మాట్లాడుతూ… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం లాంటివి ఉపాధిని, శ్రామికుని పనినీ పూర్తిగా తొలగిస్తుందన్నారు. ప్రొఫెసర్ వెంకట దాస్ మాట్లాడుతూ… రష్యాలో అతికొద్ది కాలంలో విప్లవం విజయవంతమైందన్నారు. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కార్యదర్శి జానకి రాములు మాట్లాడుతూ… కమ్యూనిస్టుల ఐక్యత కొరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విస్తృతమైన కృషి జరుగుతుందన్నారు. ఈ ఐక్యత మరింత దృఢంగా జరగాలన్నారు. కోల జనార్ధన్ మాట్లాడుతూ.. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక సామాజిక శక్తుల ఐక్య పోరాటమే ప్రజలకు నిజమైన బలం అన్నారు. ఎస్‌యుసిఐ రాష్ట్ర నాయకులు ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు ఏకం కావాలన్నారు.
ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి జోగి రెడ్డి మాట్లాడుతూ… కమ్యూనిస్టు ప్రజాతంత్ర శక్తులు తక్షణం ఏకం కావాలన్నారు. సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా మాట్లాడుతూ… లిబరేషన్ దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ లోపల బయట అనేక ప్రజా పోరాటాలు ఫాసిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, మల్లేష్, పాండురంగారావు, శ్రీనివాసరావు, సంతోష్, సోగర బేగం, నాగయ్య ప్రజాతంత్ర ఐక్యవేదిక నాయకులు, డాక్టర్ జి.శ్రీనివాసరావు, జాన్ మండలి, వర్కర్స్ పార్టీ నాయకులు, లేబర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png