Addam News
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 9:23 pm Posted by : Addam News

సైదాపూర్ మండ‌లం కళాకారుల విభాగం మహిళా అధ్యక్షురాలిగా సుద్దాల రజిని

క‌రీంన‌గ‌ర్‌, ఏప్రిల్ 2 ( అద్దం న్యూస్ ) :     క‌రీంన‌గ‌ర్ జిల్లా సైదాపూర్ మండ‌లం క‌ళాకారుల మ‌హిళా అధ్య‌క్షురాలిగా సుద్దాల రజిని నియ‌మితుల‌య్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారునిగా, ఉద్యమకారులుగా ప్రజలను చైతన్య ప‌ర్చ‌డంలో తమ వంతు పాత్ర పోషించిన పోరాడిన ఉద్యమ సమయంలో వారి పోరాట ప్రతిమను గుర్తించి సుద్దాల రజిని ని మండల అధ్య‌క్షురాలిగా నియ‌మితుల‌య్యారు. సైదాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ( టియు జెఎసి ) స్టేట్ వైస్ చైర్మన్ భోగే పద్మ, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శనిగరపు యువరాజ్, జిల్లా కార్యదర్శి గడిపే స్వరూప, మానకొండూరు నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ బుర్ల మొగిలి ఆధ్వర్యంలో ర‌జిని ని అధ్య‌క్షురాలిగా నియ‌మించారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు నియామక‌ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా రజిని మాట్లాడుతూ… త‌న పై న‌మ్మ‌కంతో త‌న‌ను క‌ళాకారుల విభాగం మ‌హిళా అధ్య‌క్షురాలిగా నియ‌మించినందుకు టియు జెఎసి రాష్ట్ర వైస్ ఛైర్మ‌న్‌ భోగే పద్మ, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శనిగరపు యువరాజ్, జిల్లా కార్యదర్శి గడిపే స్వరూప, మానకొండూరు నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ బుర్ల మొగిలి ల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్ల కుమారస్వామి, పొడిశెట్టి నరేష్, సైదాపూర్ మండల తెలంగాణ ఉద్యమ పోరం అధ్యక్షుడు వస్తాదుల సదానందం, ఉపాధ్యక్షుడు గడ్డం స్వామి తదితరులు ఉద్యమకారులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png