9 నెలల నిరీక్షణకు తెర.. భూమిని చేరుకున్న సునీత.. వీడియో ఇదిగో!
తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండైన డ్రాగన్ క్రూ అప్పటికే అక్కడ బోట్లతో సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది వ్యోమగాములను బయటకు తీసి జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలింపు తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడింది. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిని చేరుకున్నారు. సునీత, బుచ్ విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఈ తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండైంది. గంటకు దాదాపు 27...