తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, విద్యార్ధులను, ఉద్యమకారులను ఆదుకోండి – టిపిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌కు తెలంగాణ ఉద్యమకారుల వినతి
హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, విద్యార్ధులను, ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి, సెక్రటరి జనరల్ తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డిలు కోరారు. ఈ మేరకు వారు శనివారం టిపిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌ను కలిసి వినతి పత్రాన్ని అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలోని అన్ని వర్గాల వారు ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, విద్యార్ధులను, ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం...